జగన్ సారూ... మహిళా సాధికారత అంటే ఇదేనా..!?

ABN , First Publish Date - 2021-10-17T12:28:00+05:30 IST

అది మహిళలకు ఆర్థిక సాయం అందించే ‘ఆసరా’ కార్యక్రమం...

జగన్ సారూ... మహిళా సాధికారత అంటే ఇదేనా..!?

  • మహిళా కౌన్సిలర్లు వెనక్కి.. 
  • ముందు కూర్చున్న భర్తలు
  • ‘ఆసరా’లో ప్రొటోకాల్‌ బలాదూర్‌

చిత్తూరు జిల్లా/మదనపల్లె టౌన్‌ : అది మహిళలకు ఆర్థిక సాయం అందించే ‘ఆసరా’ కార్యక్రమం. ప్రొటోకాల్‌ ప్రకారం ముందు కూర్చోవాల్సిన మహిళా కౌన్సిలర్లను వెనక్కి పంపించారు. వారి భర్తలు దర్జాగా ముందు కూర్చున్నారు. మహిళా సాధికారతను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన శనివారం మదనపల్లెలో చోటుచేసుకుంది. జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన ఆసరా కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లను వెనక వరుసలో కూర్చోబెట్టారు. చెక్కులు పంపిణీలోనూ ముందుకురానీయలేదు. ప్రొటోకాల్‌ను బలాదూర్‌ చేస్తూ వేదిక మీద ముందు వరుసలో వైసీపీ నాయకులు బాబ్‌జాన్‌, సాయిప్రసాద్‌రెడ్డి, రమణారెడ్డి, కిరణ్‌రెడ్డి కూర్చోవడం కొసమెరుపు.



Updated Date - 2021-10-17T12:28:00+05:30 IST