Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇడుపులపాయ చేరుకున్న జగన్, షర్మిల

కడప: సీఎం జగన్, వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఇడుపులపాయకు చేరుకున్నారు. అన్నాచెల్లెల్లు వేర్వేరు సయమాల్లో ఇడుపులపాయకు వచ్చారు. అయితే 2వ తేదీ ఉదయం 9.30కి గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి 9.30 నుంచి 10.05 వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని దివంగత మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొంటారు. 10.15 నుంచి పార్టీ కార్యకర్తలతో మాట్లాడతారు. 11 గంటలకు బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో 11.30కు బయలుదేరి గన్నవరం చేరుకుంటారు. 12.45కు తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళతారు. షర్మిల, విజయలక్ష్మి కూడా రేపు కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌కు నివాళులు అర్పించనున్నారు. అయితే జగన్‌తో తారసపడకుండా ఉండేలా షెడ్యూల్‌ రూపొందించుకున్నట్లు తెలిసింది. వైఎస్‌‌ఆర్ 12వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి విజయలక్ష్మి గురువారం (2న) హైదరాబాద్‌లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌కు నివాళులు అర్పించిన తర్వాత విజయలక్ష్మి నేరుగా హైదరాబాద్‌కు వస్తారని చెబుతున్నారు.

Advertisement
Advertisement