సీపీఎస్ రద్దుపై జగన్ సర్కార్ మరో యూటర్న్

ABN , First Publish Date - 2022-04-26T01:39:04+05:30 IST

సీపీఎస్ రద్దుపై జగన్ సర్కార్ మరో యూటర్న్ తీసుకుంది.

సీపీఎస్ రద్దుపై జగన్ సర్కార్ మరో యూటర్న్

అమరావతి: సీపీఎస్ రద్దుపై జగన్ సర్కార్ మరో యూటర్న్ తీసుకుంది. సీపీఎస్ రద్దు వ్యవహారంలో ప్రభుత్వం కొత్త ఎత్తుగడకు సిద్ధమైంది.జీపీఎస్ పేరుతో గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌ను ప్రవేశపెడతామంటూ.. ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం తెలపడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. సీపీఎస్ మాదిరిగానే దీనిలో కూడా ఉద్యోగాల కాంట్రీబ్యూషన్‌ తప్పనిసరిగా ఉంటుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. జీపీఎస్‌కు సంబంధించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ ద్వారా.. ఉద్యోగ సంఘాలకు అధికారులు, మంత్రులు వివరించారు. పాత పెన్షన్‌ స్కీమే కావాలంటూ ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేసి.. ఉద్యోగులపై రుద్దాలని జగన్‌ సర్కార్‌ చూస్తోంది.  సీపీఎస్ రద్దు అంటూ ఉద్యోగ సంఘాలను మూడేళ్లుగా జగన్‌ సర్కార్‌ ముప్పుతిప్పలు పెడుతోంది. గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌ ప్రతిపాదనపై ఏపీ సీపీఎస్ ఈఏ, ఏపీసీపీఎస్ యూఎస్ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. 

Updated Date - 2022-04-26T01:39:04+05:30 IST