Abn logo
Jul 13 2021 @ 15:16PM

సీబీఐ కోర్టును అభ్యర్థించిన జగన్

హైదరాబాద్‌: సీబీఐ కోర్టులో సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసుపై విచారణ జరిగింది. పెన్నా సిమెంట్స్‌ కేసులో జగన్‌ డిశ్చార్జి పిటిషన్‌ దాఖలు చేశారు. పెన్నా ఛార్జిషీట్‌ నుంచి తన పేరు తొలగించాలని జగన్ కోరారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి డిశ్చార్జ్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు సీబీఐ గడువు కోరింది. పెన్నా ఛార్జిషీట్‌ నుంచి తన పేరు తొలగించాలని ఆమె కూడా కోరారు. సబిత డిశ్చార్జ్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 22కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. రాజగోపాల్‌, శామ్యూల్‌ డిశ్చార్జి పిటిషన్లపై విచారణ ఈనెల 22కి వాయిదా పడింది. ఇండియా సిమెంట్స్‌ కేసు విచారణ ఈనెల 23కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.