నిరుద్యోగులను నట్టేటముంచిన జగన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-12T05:25:22+05:30 IST

జగనన్న అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తారని... తద్వారా ఉద్యోగాలు వస్తాయని ఎన్నో ఆశలుపెట్టుకున్న నిరుద్యోగుల ఆశలను అడియాసలు చేస్తూ ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని టీడీపీ రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

నిరుద్యోగులను నట్టేటముంచిన జగన్‌రెడ్డి
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న రాంగోపాల్‌రెడ్డి

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డి


కడప (మారుతీనగర్‌), ఆగస్టు 11 : జగనన్న అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తారని... తద్వారా ఉద్యోగాలు వస్తాయని ఎన్నో ఆశలుపెట్టుకున్న నిరుద్యోగుల ఆశలను అడియాసలు చేస్తూ ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని టీడీపీ రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, భవిష్యత్‌ కార్యాచరణపై అఖిలపక్ష, యువజన, విద్యార్థి, నాయకుల ఆధ్వర్యంలో గురువారం స్థాని క ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. 

సమావేశానికి ముఖ్య అతిధిగా రాంగోపాల్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ఉద్యోగావకాశాలు కల్పిస్తాడనే ఆశతో గత ఎన్నికల్లో నిరుద్యోగులు వైసీపీని గెలిపించారన్నారు. మూడున్నర సంవత్సరాలవుతున్నా ఇంతవరకు ఉద్యోగాలు లేవని.. జాబ్‌క్యాలెండర్‌ అంటూ జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ విడుదల చేసి నిరుద్యోగులను నట్టేట ముంచారని నిప్పులు చెరిగారు. 

కేంద్రం ఏది ఆదేశించినా జీ హుజూర్‌ అంటూ ఇటీవల జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలయ్యేలా జీవో నెంబర్‌ 117 విడుదల చేశారన్నారు. ఆ జీవో కారణంగా 16 వేల టీచర్లు అదనంగా ఉన్నారనే వీలుందన్నారు. మరో దశాబ్ధం పాటు టీచర్‌ ఉద్యోగాలు భర్తీకి నోచుకోని పరిస్థితి దాపురిస్తుందన్నారు. ఇక రాష్ట్రంలో సుమారు 10 వేల గ్రూప్‌-4 ఉద్యోగాలు ఖాళీగా వుంటే తూతూ మం త్రంగా 657 ఉద్యోగాల భర్తీకే నోటిఫికేషన్‌ ఇవ్వడం విచారకరమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్‌ నిరుద్యోగులకిచ్చిన హామీని నిలబెట్టుకునేలా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలన్నారు. లేని పక్షంలో ఈనెల 22న విద్యార్థి, యువజన సంఘాల సారధ్యంలో చలో కలెక్టరేట్‌ ముట్టడికి నిరుద్యోగులు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మీడియా కో ఆర్డినేటర్‌ జనార్థన్‌రావు, ఏఐఎ్‌సఎఫ్‌ నాయకుడు సుబ్బరాయుడు, ఐటీడీపీ జిల్లా ఇన్‌చార్జ్‌ నరసింహ, ఎస్‌ఎ్‌ఫఐ నాయకుడు నాయక్‌, తెలుగుయువత నాయకుడు అమర్‌నాథ్‌రెడ్డి, పలువురు విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T05:25:22+05:30 IST