జగన్ పాలన పూర్తిగా గాడి తప్పింది: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-10-24T23:09:44+05:30 IST

జగన్ ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పిందని సీపీఐ రామకృష్ణ తప్పుబట్టారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం దివాళా దిశగా సాగుతోందన్నారు.

జగన్ పాలన పూర్తిగా గాడి తప్పింది: రామకృష్ణ

ప్రకాశం: జగన్ ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పిందని సీపీఐ రామకృష్ణ తప్పుబట్టారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం దివాళా దిశగా సాగుతోందన్నారు. అప్పులు తెస్తేనే రాష్ట్ర మనుగడ.. లేకపోతే దుర్భర పరిస్థితి అన్నట్లుగా మారిందని చెప్పారు. ఆర్ధికంగా చిన్నాబిన్నమై అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. అందని ద్రాక్షలా ఇసుక, ఇటుక, ఉక్కు ధరలు పెరిగిపోయాయని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-24T23:09:44+05:30 IST