ప్రధానితో ముగిసిన Jagan భేటీ

ABN , First Publish Date - 2022-06-02T23:25:02+05:30 IST

ప్రధాని మోదీతో సీఎం జగన్‌ (Jagan) భేటీ ముగిసింది. అరగంటకు పైగా మోదీ, జగన్‌ భేటీ అయ్యారు. కాసేపట్లో కేంద్ర మంత్రి నిర్మలతో జగన్‌ భేటీ అవుతారు.

ప్రధానితో ముగిసిన Jagan భేటీ

ఢిల్లీ: ప్రధాని మోదీతో సీఎం జగన్‌ (Jagan) భేటీ ముగిసింది. అరగంటకు పైగా మోదీ, జగన్‌ భేటీ అయ్యారు. కాసేపట్లో కేంద్ర మంత్రి నిర్మలతో జగన్‌ భేటీ అవుతారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను, ఇతర కేంద్ర మంత్రులనూ జగన్ కలిసే అవకాశముంది. అయితే జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేతలు సెటైర్లు విసురుతున్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్రం, ఏపీకి ఇచ్చిన హామీలపై కేంద్రంపై జగన్ ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో జగన్‌కు ఒక అద్భుతమైన అవకాశం వచ్చిందని, ప్రత్యేక హోదా సహా పలు విభజన హామీలు నెరవేరిస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని మోదీకి జగన్‌ గట్టిగా చెప్పాలని టీడీపీ నేతలు సూచించారు.


‘రాష్ట్ర విభజన హామీల అమలుకు మోదీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్‌ ఒత్తిడి తీసుకురావడం లేదు. ప్రధానిని కలిసేది స్వప్రయోజనాల కోసమే. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు’ అనే ఆరోపణల నుంచి బయటపడేందుకు జగన్‌కు మంచి అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలకు తాను కట్టుబడి ఉన్నానని నిరూపించుకునేందుకు.. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా, పోలవరం అంచనాల సవరణ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల, రెవెన్యూ లోటు భర్తీ, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ వంటి హామీలపై కేంద్రాన్ని నిలదీసే ‘చాన్స్‌’ లభించింది. అది.. రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చింది. త్వరలో రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ అభ్యర్థి విజయం ఈసారి అంత సులువు కాదు. సొంతంగా తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన బలం ఎన్‌డీఏకు లేదు. ఎవరైనా సరే.. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా గెలవడం కష్టం. ఇలాంటి సమయంలో జగన్, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2022-06-02T23:25:02+05:30 IST