జగన్ హయాంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం: పీతల సుజాత

ABN , First Publish Date - 2022-07-06T22:38:08+05:30 IST

ఎం జగన్ హయాంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతోందనని టీడీపీ నేత పీతల సుజాత ఆందోళన వ్యక్తం చేశారు.

జగన్ హయాంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం: పీతల సుజాత

జంగారెడ్డిగూడెం: సీఎం జగన్ హయాంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతోందని టీడీపీ నేత పీతల సుజాత ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అమ్మఒడి, విద్యాదీవెన పథకాలను రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుని వారిని ఫెయిల్ చేసిందని దుయ్యబట్టారు. ఇప్పటివరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సమకూర్చని ప్రభుత్వం.. విద్యార్థులకు ట్యాబ్స్ ఇస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాం నుంచే విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఈ ట్యాబ్స్ ఎందుకు? అని ప్రశ్నించారు. పాఠశాలల విలీన ప్రక్రియ వల్ల విద్యార్థులు 5 కిలోమీటర్లు నుండి 10 కిలోమీటర్లు చదువు కోసం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థులపై నిజంగా జగన్‌కు ప్రేమ ఉంటే కార్పొరేట్ తరహాలో ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించాలని పీతల సుజాత డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-06T22:38:08+05:30 IST