అమరావతి: సీఎం జగన్ మోసపు మాటలు కోటలు దాటుతాయని, చేతలు తాడేపల్లి ప్యాలెస్ కాంపౌండ్ కూడా దాటవని టీడీపీ నేత నారా లోకేష్ తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బస్సు ప్రమాదంలో చనిపోయిన.. కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వడమేమిటని, కనీసం రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు భాకరాపేట ఘటన బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి.. చేతులు దులుపుకోవాలని వైసీపీ చూస్తోందని లోకేష్ మండిపడ్డారు.