Abn logo
Apr 3 2020 @ 10:08AM

కరోనాపై జగన్ ఉన్నతస్థాయి సమావేశం

అమరావతి:  రాష్ట్రంలో ప్రబలుతున్న కోవిడ్ 19పై ముఖ్యమంత్రి జగన్ తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ లింక్స్, కరోన కేసులు అంతకంతకూ పెరుగుతుండడం.. వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్, ఎన్ 95 మాస్కులు అందుబాటులోకి తేవడంపై చర్చించనున్నారు. 


కోవిడ్ 19ను ఎదుర్కోవడానికి అమలవుతున్న లాక్‌డౌన్ పైనా చర్చించనున్నారు. లాక్‌‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అదేశించే అవకాశం ఉంది. నిత్యావసరాల రవాణాకు ఆటంకం లేకుండా చూడాలని, ఆక్వా రైతులను, ఇతర రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవడంపై ఆదేశాలు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement
Advertisement