Jagan సొంత జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2022-05-12T02:16:11+05:30 IST

సీఎం జ‌గ‌న్‌ సొంత జిల్లాలో దారుణం జరిగింది. ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Jagan సొంత జిల్లాలో దారుణం

కడప: సీఎం జ‌గ‌న్‌ సొంత జిల్లాలో దారుణం జరిగింది. ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మార్కెట్‌ దగ్గర బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ కామాంధుల వల్ల ఆ బాలిక గర్భం దాల్చింది.. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భిణి. విషయం తెలిసినా పోలీస్ అధికారులు కేసు నమోదు చేయలేదు. స్థానికుల సమాచారంతో బాలికను ఎంఎస్‌కేలు విచారించారు. 10 మంది యువకులు తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. విషయాన్ని వీడియో తీసి ప్రొద్దుటూరు సీఐ నాగరాజు దృష్టికి ఎంఎస్‌కేలు తీసుకెళ్లారు. విషయం బయటకు పొక్కకుండా బాలికను మరో చోటికి తరలించాలని సీఐ ఆదేశించారు. బాలికను ఇస్లాపురం నుంచి అమృతనగర్‌కు ఎంఎస్‌కేలు పంపారు. న్యాయం చేయకుండా బాలికను తరలించడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


Read more