Abn logo
May 29 2020 @ 15:54PM

ఏపీకి జగన్ లాంటి ముఖ్యమంత్రి మళ్లీ దొరకడు: జేసీ దివాకర్‌రెడ్డి

అమరావతి: ఏపీకి జగన్ లాంటి ముఖ్యమంత్రి మళ్లీ దొరకడని, జగన్ ఏడాది పాలనకు వందకు 110మార్కులు వేస్తానని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఎద్దేవాచేశారు. జగన్ పట్టుదల పరాకాష్టకు చేరిందనటానికి హైకోర్టు తీర్పే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనటాన్ని జగన్ మానుకోవాలని సూచించారు. రాజ్యాంగం జోలికి వెళ్తే ఇలాంటి తీర్పులే వస్తాయని ప్రభుత్వానికి ముందే తెలుసని, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళడం ప్రభుత్వం ఇష్టమన్నారు. జగన్ శ్రీరాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలని దివాకర్‌రెడ్డి చెప్పారు. చరిత్ర అనే పుస్తకంలో తనకు ఒక్క పేజీ ఉండాలనేది జగన్ ఆలోచన అని పేర్కొన్నారు. టీటీడీ ఆస్తులు అమ్మాలని వైవీ.సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం జగన్ సంక్షేమంపై దృష్టిసారించారని, సంక్షేమానికి ఓట్లు పడవన్న విషయం 2019లో తేలిందని జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement