‘రాష్ర్టాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగన్‌దే’

ABN , First Publish Date - 2022-08-11T04:27:47+05:30 IST

నవ్యాంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్‌బాబు అన్నారు. బుధవారం మండలంలోని బోడవాడ గ్రామంలోని నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. తొలుత స్థానిక పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

‘రాష్ర్టాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగన్‌దే’
బోడవాడలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యం

చంద్రబాబుతోనే నవ్యాంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం

బాదుడే బాదుడు కార్యక్రమంలో సలగల రాజశేఖర్‌బాబు

బోడవాడ(పర్చూరు), ఆగస్టు 10:  నవ్యాంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్‌బాబు అన్నారు. బుధవారం మండలంలోని బోడవాడ గ్రామంలోని నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. తొలుత స్థానిక పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ ప్రజల సొమ్మును దోచుకుని అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులు పెడుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎన్నికల సమయంలో అమలు కానీ హామీలను గుప్పించి ప్రజలను నిలువునా మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జగన్‌ పరిపాలనలో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అభివృద్ధి పథంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నేడు తిరోగమన స్థితికి చేరిందన్నారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ పన్నుల రూపంలో ప్రజలను బాదుతున్న తీరుపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు షేక్‌ షంషుద్దీన్‌, గ్రామ సర్పంచ్‌ కూనంనేని బాపూజీ, అప్పలనేని నరేంద్ర, గోరంట్ల రామకృష్ణ, కన్నెగంటి సాంబయ్య, తెలుగుయువత అధ్యక్షుడు షేక్‌ ఫారూక్‌, ప్రధాన కార్యదర్శి నాగరాజు, శివ, శ్రీరాం సుబ్బారావు, మామిడిపాక హరిప్రసాద్‌, చింపయ్య, దొరబాబు, రమేష్‌, జీవన్‌, షేక్‌ హస్సేన్‌, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-11T04:27:47+05:30 IST