అన్నింటా జగన్‌ మోసం

ABN , First Publish Date - 2022-07-04T06:02:38+05:30 IST

పన్నులు, సుంకాలతో జగన్‌ రెడ్డి ప్రజలపై పెను భారాలు మోపుతున్నాడని టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అన్నింటా జగన్‌ మోసం
వెల్లటూరులో మాజీమంత్రి దేవినేని ఉమా పాదయాత్ర

 వెల్లటూరు బాదుడే - బాదుడులో మాజీ మంత్రి దేవినేని ఉమా

జి.కొండూరు, జూలై 3: పన్నులు, సుంకాలతో జగన్‌ రెడ్డి ప్రజలపై పెను భారాలు మోపుతున్నాడని టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెల్లటూరు గ్రామంలో ఆదివారం జరిగిన బాదుడే - బాదుడు నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు కరపత్రాలు పంచుతూ ధరల వ్యత్యాసాన్ని, పన్నుల వడ్డనను వివరించారు.  ఉమా మాట్లాడుతూ చంద్రన్న బీమా, అన్న క్యాంటిన్‌, సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలు పోయాయి. రంజాన్‌ తోఫా ఎత్తేశాడన్నారు. అమ్మఒడి సొమ్ము నాన్న బుడ్డికి సరిపోవడం లేదన్నారు. జే.బ్రాండ్‌ తాగిన వారికి పక్షవాతం వస్తుందన్నారు.  బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో, దారి డొంక లేని రైల్వే గేట్లు దాటి అటవీ ప్రాంతాల్లో నివాసయోగ్యం కాని చోట నివేశన స్థలాలు ఇచ్చారని ఆరోపించారు. ఐరన్‌ టన్ను లక్ష, భారతి సిమెంట్‌ బస్తా 450లు అయ్యింది, ఉచిత ఇసుక రద్దుతో సమాన్యులకు ఇసుక కొరత వచ్చిందన్నారు. పెరిగిన ఆర్టీసీ చార్జీల పెంపుతో రాష్ట్రంలో ఎటు వైపు నలుమూలలకు వెళ్లి రావాలంటే తలకు రూ.150 వరకు అదనపు భారం పడిందన్నారు. వలంటీర్లతో భయపెట్టినా పోలీసులతో బెదిరించినా కేసులకు అరెస్టులకు భయపడేది లేదన్నారు. కార్యక్రమంలో పచ్చిగోళ్ల రామారావు, పచ్చిగోళ్ల బాలకృష్ణ, కుంటముక్కల ఎంపీటీసీ సందిపాము జయలక్ష్మి, అంకెం ఇందిరా ప్రియదర్శిని, జువ్వా రామకృష్ణ, లంక లితీష్‌, ఆర్‌.శివయ్య, కారుకొండ శ్రీనివాసరావు, పజ్జూరు రవికుమార్‌, లంక రామకృష్ణ, సుకవాసి శ్రీహరి, ధనేకుల శ్రీకాంత్‌, మన్నం వెంకట చౌదరి పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-04T06:02:38+05:30 IST