వైఎస్ హయాంలో ఆ స్కీమ్‌కు ప్రోత్సాహాలు.. జగన్ ప్రభుత్వంలో మాత్రం నిర్వీర్యం..!

ABN , First Publish Date - 2020-09-22T16:25:21+05:30 IST

బిందు, తుంపర సేద్యం.. తక్కువ నీటితో, ఎక్కువ దిగుబడి. సాగు వ్యయం తగ్గించి పంట నాణ్యతతో పాటు ఆదాయం పెరగ డంతో పాటు పర్యావరణ హితం. ఇలాంటి సేద్యాన్ని గత ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రోత్స హించాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ విధానంపై అలక్ష్యంగా వ్యవహరిస్తుండ టంతో రైతులు ముందుకు రావడంలేదు.

వైఎస్ హయాంలో ఆ స్కీమ్‌కు ప్రోత్సాహాలు.. జగన్ ప్రభుత్వంలో మాత్రం నిర్వీర్యం..!

బిందు, తుంపర సేద్యంపై అలక్ష్యం

వైఎస్‌ఆర్‌ హయాంలో పెద్దఎత్తున ప్రోత్సాహాలు

జగన్‌ ప్రభుత్వంలో ఏపీఎంఐపీ స్కీం నిర్వీర్యం 

గత ప్రభుత్వం బకాయిలు రూ.200 కోట్లు బిల్లుల పెండింగ్‌

కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న కాంట్రాక్టర్లు, ఉద్యాన రైతులు


గుంటూరు (ఆంధ్రజ్యోతి): బిందు, తుంపర సేద్యం.. తక్కువ నీటితో, ఎక్కువ దిగుబడి. సాగు వ్యయం తగ్గించి పంట నాణ్యతతో పాటు ఆదాయం పెరగ డంతో పాటు పర్యావరణ హితం. ఇలాంటి సేద్యాన్ని గత ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రోత్స హించాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ విధానంపై అలక్ష్యంగా వ్యవహరిస్తుండ టంతో రైతులు ముందుకు రావడంలేదు. పర్యావరణ హితంగా ఉన్న ఈ సాగు విధా నాన్ని  2005లో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏపీ ఎంఐపీ పేరిట ఈ పథకాన్ని ప్రవేశపెట్టి నిధులు కూడా కేటాయించి ఉద్యాన అధికారులకు లక్ష్యాలను కూడా నిర్దేశించి రైతులను చైతన్యవంతం చేశారు. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ పథకం ఆయన తనయుడు జగన్‌ హయాంలో నిర్లక్ష్యానికి గురవుతుందని రైతులు వాపోతున్నారు. పాత బకాయిలు విడుదల చేయకపోవడంతో పాటు.. ప్రతిపాదనలు కూడా ప్రణాళికలకే పరిమితం అవుతుండటంతో రైతులు ఆసక్తి చూపడంలేదు.


తక్కువ నీటితో ఎక్కువ పంట.. నీటిని పొదుపుగా ఉపయోగించుకోవడం.. వ్యవసాయ రంగంలో విద్యుత్‌ వాడకాన్ని తగ్గించడం.. తదితర లక్ష్యాలతో 15 ఏళ్ల క్రితం రాష్ట్రంలో బిందు, తుంపర సేద్యాన్ని ప్రోత్సహించే విధంగా ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టును(ఏపీఎంఐపీ) ప్రవేశపెట్టారు. ప్రతి యేటా జిల్లాలో ఉద్యాన పంటల సాగులో 15 - 20 శాతం విస్తీర్ణాన్ని దీని పరిధిలోకి తేవాలని ప్రతిపాదించారు. జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాలలో వివిధ రకాల ఉద్యాన పంటలు సాగు అవు తున్నాయి. ఇప్పటి వరకు లక్ష ఎకరాలలో బిందు, తుం పర సేద్యాన్ని ప్రవేశపెట్టారు. లక్ష ఎకరాలలో బిందు, తుంపర సేద్యం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. అయితే జగన్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని రైతులు వాపోతున్నారు. జిల్లా లో గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన బిందు, తుం పర సేద్యం బిల్లులు  సుమారు రూ.200 కోట్లు పెం డింగ్‌లో ఉన్నాయి. బిందు, తుంపర సేద్యంలో డ్రిప్పు, స్పింక్లర్‌, బోర్లు, పైపులైన్లు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.   పాత బకాయిలు విడుదల చేయాల ని ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్‌ చిరంజీవిచౌదరి, మంత్రి కన్నబాబులకు అనేక సార్లు వినతిపత్రం అంద జేసినా ఫలితం లేదు. దీంతో రెండేళ్ల నుంచి కొత్తగా బిందు, తుంపర సేద్యంవైపు వెళ్లే రైతుల సంఖ్య తగ్గింది. 2019-20, 2020-21లో జిల్లాలో సుమారు 30 వేల నుంచి 40 వేల ఎకరాల  బిందు, తుంపర సేద్య సాగు విస్తీర్ణం పడకన పడింది. ప్రత్యేకంగా నిధులు కేటాయించక పోవడంతో అధికారులు కూడా ప ట్టించుకోవడంలేదు. గత ప్రభుత్వాల హయాంలో అధికారులు వెంటపడి మరీ బిందు, తుంపర సేద్యంపై రైతుల మొగ్గేలా చేసేవారు. దీనిపై గ్రామాల్లో ప్రత్యేకం గా సదస్సులు పెట్టి సబ్సిడీతో పరికరాలు అందించడం తో పాటు సలహాలు, సూచనలు అందించేవారు. అయి తే ఈ ప్రభుత్వం అలాంటి ఆలోచనే చేయక పోవడంతో ఆసక్తి ఉన్న రైతులు కూడా వెనకంజ వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రోత్సాహం లేక పోవడంతో ఈ విధానంలో సాగుపై రైతులు ఆసక్తి చూపడంలేదు.   


ఆర్‌బీకేల ద్వారానే..

ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ రంగాలను క్షేత్ర స్థాయిలో రైతులకు చేరువ చేయడం కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏపీ ఎంఐపీ పథకాలను కూడా ఆర్‌బీకేల ద్వారా చేపడ తామని జిల్లా అధికారులు తెలిపారు. బిందు, తుంపర సేద్యం దరఖాస్తులను ఆర్‌బీకేలలో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. 2019-20, 2020-21లో ఈ పథకంలో స్వీకరించిన దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. 


నాణ్యత, ఆదాయం పెరుగుదల

ఈ పథకంలో 90-100 శాతం సబ్సిడీ ఇస్తారు. బిందు, తుంపర సేద్యంలో ఏర్పాటు చేసే పైపులు, ట్యూబులు, ఇతర పరికరాలు 8-10 ఏళ్లపాటు ఉంటాయి. ఉద్యాన పంటలు సాగు అయ్యే భూముల్లో బోరు వేసి దానికి డ్రిప్పు, స్పింక్లర్‌లను అనుసంధానం చేస్తే ఆ భూమిలో ఏటా 2-3 పంటలు పండించే అవకాశం ఉంది. పంటకు ఎప్పుడు నీరు అవసరమైతే అప్పుడే దీని ద్వారా సరఫరా చేయవచ్చు. ప్రధానంగా బిందు, తుంపర సేద్యంలో రైతులకు 20 శాతం ఆదాయం పెరుగుతుంది. పంటలో నాణ్యత పెరిగి ఖర్చులు తగ్గుతాయి. 

Updated Date - 2020-09-22T16:25:21+05:30 IST