అమరావతి : ఏపీ కేబినెట్‌లో వన్ టైం సెటిల్మెంట్ పథకంపై జగన్ సర్కార్ మరో పిల్లి మొగ్గ వేసింది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని పేద ప్రజలు వ్యతిరేకిస్తుండడంతో వారిపై వాయిదాల వ్యూహం పన్నింది. కేబినెట్‌లో ఓటీఎస్ స్కీమును రెండు వాయిదాలల్లో చెల్లించేలా గృహ నిర్మాణశాఖ అధికారులు డ్రాఫ్ట్‌ను ప్రతిపాదించారు. కట్టాల్సిన మొత్తంలో రూ.5 వేలు ఉగాదికి ముందు... మరో రూ.5 వేలు దీపావళికి ముందు చెల్లిచేలా ముసాయిదా తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.