అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బెదిరింపులకు జగన్ ప్రభుత్వం భయపడదని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ జీవితంలో జగన్‌ను ఓడించలేరని అన్నారు. కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని కొందరు పెద్ద నిర్మాతలు.. విచ్చలవిడిగా బెనిఫిట్ షోలు వేసి ప్రజల డబ్బు దోచుకున్నారని విమర్శించారు. చిన్న సినిమాలు బతకాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని కొడాలి నాని తెలిపారు.