జర్నలిస్టులకు YS Jagan ఝలక్‌

ABN , First Publish Date - 2021-12-20T08:36:52+05:30 IST

అక్కడ ఉత్తర్వుల అమలు కోసం ఆదేశాలివ్వకపోగా.. అసలు వాటిని అమలే చేయొద్దని...

జర్నలిస్టులకు YS Jagan ఝలక్‌

  • వారి పిల్లలకు స్కూలు ఫీజుల రాయితీ కట్‌

అమరావతి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పాత్రికేయుల పిల్లలకు పాఠశాలల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉత్తర్వులను జగన్‌ సర్కారు తాజాగా నిలిపేసింది. పాత్రికేయుల పిల్లలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తూ అప్పట్లో ప్రతి జిల్లాలోనూ జిల్లా విద్యాశాఖాధికారులు ఉత్తర్వులిచ్చారు. కొన్ని చోట్ల ఇది అమలుకావడం లేదని జిల్లాల్లో పాత్రికేయ సంఘాలు డీఈవోలకు వినతిపత్రాలు ఇచ్చాయి. సదరు డీఈవోలు ఈ అంశాన్ని పాఠశాల విద్య డైరక్టర్‌కు నివే దించారు. అక్కడ ఉత్తర్వుల అమలు కోసం ఆదేశాలివ్వకపోగా.. అసలు వాటిని అమలే చేయొద్దని నిర్దేశించడం గమనార్హం.  ఇది రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయమని, డీఈవోలు ఇలాంటి సర్క్యులర్లు ఇవ్వడం, అమలుచేయడం వద్దని తేల్చిచెప్పారు. దీనిపై పాత్రికేయ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.


Updated Date - 2021-12-20T08:36:52+05:30 IST