అత్యంత కుట్రపూరితమైన ఆర్ధిక నేరంలో జగన్ ప్రధాన ముద్దాయి: వర్ల

ABN , First Publish Date - 2020-10-29T01:18:35+05:30 IST

అత్యంత కుట్రపూరితమైన ఆర్ధిక నేరంలో సీఎం జగన్ ప్రధాన ముద్దాయని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు.

అత్యంత కుట్రపూరితమైన ఆర్ధిక నేరంలో జగన్ ప్రధాన ముద్దాయి: వర్ల

హైదరాబాద్: అత్యంత కుట్రపూరితమైన ఆర్ధిక నేరంలో సీఎం జగన్ ప్రధాన ముద్దాయని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. కోర్టులో విచారణ మొదలైనందున సీఎం మానసిక సంఘర్షణకు గురయ్యే అవకాశముందన్నారు. సంక్షేమ నిర్ణయాల సమయంలో సీఎం తడబడే ప్రమాదంఉందన్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఆ పదవిని ఒక ఉప ముఖ్యమంత్రికి ఇస్తే.. ఎలా ఉంటుందో ఆలోచించాలని వర్ల రామయ్య సూచించారు.


జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం విచారణ మొదలైంది. సాయంత్రం వరకూ వాదనలు కొనసాగాయి. సీబీఐ దాఖలు చేసిన 11, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాఖలు చేసిన 5 చార్జీషీట్లపై సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ మధుసూదన్‌రావు విచారణ చేపట్టారు. జగతి పెట్టుబడులు, వాన్‌పిక్‌, రాంకీ, పెన్నా సిమెంట్‌, రఘురాం సిమెంట్స్‌ వంటి ప్రధాన కేసులు ఇందులో ఉన్నాయి.

Updated Date - 2020-10-29T01:18:35+05:30 IST