‘గోరంట్ల’ చేష్టలు జగన్‌కు కనిపించలేదా..!

ABN , First Publish Date - 2022-08-07T06:34:37+05:30 IST

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించి, పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ శ్రేణులు శనివారం పట్ట ణంలోని రింగురోడ్డులో ధర్నా నిర్వహిం చారు.

‘గోరంట్ల’  చేష్టలు జగన్‌కు కనిపించలేదా..!
అనకాపల్లిలోని రింగురోడ్డు వద్ద ధర్నా చేస్తున్న టీడీపీ శ్రేణులు

  అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 6: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించి, పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ శ్రేణులు శనివారం పట్ట ణంలోని రింగురోడ్డులో ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రత్నకుమారి మాట్లాడుతూ దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ అంటూ ప్రజలు వేడుకలు జరుపుకుంటుండగా, అంతా సిగ్గుపడేలా సాక్షాత్తూ పార్లమెంట్‌ సభ్యుడు గోరంట్ల మాధవ్‌ వ్యవహరించడం దారుణమన్నారు.  ఇలాంటి వ్యక్తులను వెనుకేసుకుని రావడంచూస్తుంటే ముఖ్యమంత్రి జగన్‌కు మహిళల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. ఇదిలావుంటే, తొలుత పార్టీ కార్యా లయం నుంచి ప్రదర్శనగా వచ్చి ధర్నా చేపట్టగా పోలీసులు రత్నకుమారితో పాటు మరో 10 మందిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. తెలుగు మహిళ ప్రతినిధులు కాయల ప్రసన్నకుమారి, వేదుల సూర్యప్రభ, ఆర్‌. మాలతి, తెలుగు యువత అధ్యక్షుడు మరపురెడ్డి సత్యనారాయణ, కాశీనాయుడు, శ్రీను, మువ్వల సూర్యనారాయణ, సిరసపల్లి రమేష్‌, శానాపతి భరత్‌కుమార్‌, కోట్ని శేషు తదితరులు పాల్గొన్నారు. అరెస్టయిన వారిని  కొద్దిసేపు తరువాత విడిచిపెట్టారు.

మాధవ్‌ తప్పును కప్పిపుచ్చేందుకు ఎత్తులు : పీలా  

 అనకాపల్లి అర్బన్‌ : ఎంపీ గోరంట్ల మాధవ్‌ను వెంటనే భర్తరఫ్‌ చేయాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ శనివారం  డిమాండ్‌ చేశారు. నేరచరిత్ర కలిగిన వారిని ముఖ్యమంత్రి జగన్‌ ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మాధవ్‌ చేసిన తప్పును కప్పిపుచ్చేందుకే ముఖ్యమంత్రి ఫోరెన్సిక్‌ విచారణ పేరుతో డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. గతంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అంబటి రాంబాబు, జోగి రమేష్‌, శ్రీనివాసరావు వంటి వారికి మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారన్నారు. 

ఎంపీపై వెంటనే చర్యలు చేపట్టాలి : లాలం

కోటవురట్ల: సీఎం జగన్‌కు  మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్య దర్శి లాలం కాశీనాయుడు డిమాండ్‌ చేశారు. మండలంలోని జల్లూరులో శనివారం ఏర్పాటైన కార్య క్రమంలో మాట్లాడారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠి నంగా వ్యవహరించాల్సిన సీఎం ఇలా నాన్చుడు ధోరణి అవలంభిస్తుండడం  అనుమానాలకు తావిస్తోంద న్నారు.  ఎంపీ మాధవ్‌ రాసలీలు వీడియో     ద్వారా బయటకు రావడంతో ఆ బురదను అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్‌పై వేయడానికి ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటాన్నారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-07T06:34:37+05:30 IST