అమరావతి: కోవిడ్ విస్తరణ, నివారణ చర్యలపై సీఎంలతో ప్రధాని వర్చువల్ సమావేశం నిర్వహించారు. ప్రధాని నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. కొవిడ్ విస్తరణ, నివారణ చర్యలపై మోదీతో జగన్ చర్చించారు. దేశంలో కొవిడ్ విస్తరణ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ ప్రెజంటేషన్ ఇచ్చింది. 15-18 ఏళ్ల మధ్య వారికి అధికంగా వ్యాక్సిన్లు వేసిన రాష్ట్రాల్లో ఏపీ ముందుంది. మొదటి డోస్ 100 శాతం పూర్తిచేసిన రాష్ట్రాల్లో ఏపీ ప్రథమంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి