రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలి: జగన్

ABN , First Publish Date - 2021-08-02T20:54:23+05:30 IST

ఆస్పత్రుల్లో నాడు – నేడుకు సంబంధించి పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తికావాలని సీఎం ఆదేశించారు.

రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలి: జగన్

అమరావతి: ఆస్పత్రుల్లో నాడు – నేడుకు సంబంధించి పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తికావాలని సీఎం ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్‌కాలేజీల్లో పనుల ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. వైద్యారోగ్య రంగంలో నాడు – నేడు పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధవహించాలని ఆదేశించారు. వచ్చే రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇంటింటికీ సర్వే కొనసాగాలని, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని, 45 ఏళ్లకు పైబడ్డవారు, గర్భవతుల తర్వాత టీచర్లకు వ్యాక్సినేషన్‌లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని, పెళ్లిళ్లల్లో 150 మందికే పరిమితం చేయాలని జగన్ ఆదేశాలిచ్చారు.

Updated Date - 2021-08-02T20:54:23+05:30 IST