Jaganకు చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2022-06-13T22:30:22+05:30 IST

సీఎం జగన్‌ (Jagan)కు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. ఏపీపీఎస్సీ (APPSC) నోటిఫికేషన్ల

Jaganకు చంద్రబాబు లేఖ

అమరావతి: సీఎం జగన్‌ (Jagan)కు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. ఏపీపీఎస్సీ (APPSC) నోటిఫికేషన్ల జారీలో జాప్యంపై లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ హామీ దృష్ట్యా మూడేళ్లుగా యువత ఎదురుచూపులు చూస్తున్నారని తెలిపారు. గ్రూప్‌-1 ఎంపిక తీరుపట్ల అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన ఉందన్నారు. అడుగడుగునా అవకతవలకు పాల్పడ్డారని అభ్యర్థుల ఆరోపిస్తున్నారని తెలిపారు. అస్మదీయుల కోసం గ్రూప్‌-1లో అక్రమాలకు తెరతీశారని ఆరోపించారు. రెండుసార్లు విడుదల చేసిన ఫలితాల్లో తేడాతో అభ్యర్థుల్లో ఆందోళనకు గురయ్యారని తెలిపారు. విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-06-13T22:30:22+05:30 IST