Abn logo
Sep 3 2021 @ 16:24PM

సీఐడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ

హైదరాబాద్‌: సీఐడీ కోర్టులో సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది. లేపాక్షి, ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టల కేసులో జగన్‌ డిశ్చార్జ్‌ పిటిషన్లపై విచారణ జరిపారు. జగన్‌ డిశ్చార్జ్‌ పిటిషన్లపై కౌంటర్ల దాఖలుకు  సీబీఐ గడువు కోరింది. లేపాక్షి, ఇళ్ల  ప్రాజెక్టుల కేసుల్లో ఎంపీ విజయసాయిరెడ్డి డిశ్చార్జ్‌ పిటిషన్లపై విచారణ జరిగింది. విజయసాయి డిశ్చార్జ్‌ పిటిషన్లపై కౌంటర్ల దాఖలుకు సీబీఐ గడువు కోరింది. కార్మెల్‌ ఏషియా, జగతి పబ్లికేషన్స్‌, బీపీ ఆచార్య డిశ్చార్జ్‌ పిటిషన్లపై కౌంటర్ల దాఖలుకు సీబీఐ  గడువు కోరింది. సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణను కూడా చేపట్టారు. ఓఎంసీ కేసులో సీబీఐ వాదనలకు విచారణ ఈనెల 9కి వాయిదా పడింది. ఐఏఎస్‌ శ్రీలక్ష్మి డిశ్చార్జ్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 9కి వాయిదా వేశారు.