అమరావతి: ఎంపీ విజయసాయిరెడ్డికి సీఎం జగన్ షాకివ్వనున్నారు. ఉత్తరాంధ్రలో చక్రం తిప్పుతున్న విజయసాయిపై వైసీపీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. భూ దందాలు, బెదిరింపుల్లో నెల్లూరు పెద్దారెడ్డి పాత్ర ఉందని అంతర్గత విచారణలో తెలుసుకున్న అధిష్టానం ఉత్తరాంధ్ర నుంచి ఆయనను పంపించేందుకు ముహుర్తం రెడీ చేసుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు చూసిచూడనట్లు వ్యవహరించిన అధిష్టానం.. హయగ్రీవ జగదీశ్వర్ సంచలన సెల్ఫీ వీడియోతో ఇక విజయసాయిని తప్పంచడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. పైగా విజయసాయి ఈ మధ్య కాలంలో వైరాగ్యంగా మాట్లాడుతున్నారు. విజయసాయిని దూరం పెడతారనేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని చెబుతున్నారు. విజయసాయి భూ లావాదేవీలపై నివేదక పంపారనే ప్రచారం కూడా ఉంది. ఈ నివేదికను పరిశీలించిన వైసీపీ అధిష్టానం విజయసాయిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేల్చుకుని, నేతలు ఖంగుతున్నారట. ఈ ఆరోపణల నేపథ్యంలోనే విజయసాయి ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జీగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని వైసీపీ భావిస్తోంది. ఆయనను అక్కడి నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి