జగన్‌ సీఎం కావడం ఏపీకి శాపం

ABN , First Publish Date - 2022-07-07T07:03:49+05:30 IST

ఏపీకి జగన్‌ సీఎం కావడం రాష్ట్ర ప్రజలకు పెద్ద శాపం అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

జగన్‌ సీఎం కావడం ఏపీకి శాపం
మాట్లాడుతున్న బీవీ జయనాగేశ్వరరెడ్డి

తాగునీటిపై వైసీపీ రాజకీయం
మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

గోనెగండ్ల, జూలై 6: ఏపీకి జగన్‌ సీఎం కావడం రాష్ట్ర ప్రజలకు పెద్ద శాపం అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం గోనెగండ్లలోని టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా బీవీ మాట్లాడుతూ జగన్‌ సీఎం అయినప్పటి నుంచి అభివృద్ధిలో ఏపీ పాతికేళ్ల వెనకపడిపోయిందన్నారు. జిల్లాలను పెంచే సమయంలో ఆదోనిని జిల్లాగా మార్చుతామని మాట ఇచ్చి తప్పిన సీఎం ఏ ముఖం పెట్టుకొని ఆదోనికి వచ్చారని ప్రశ్నించారు. గోనెగండ్ల తాగునీటి సమస్యను మరింత తీవ్రం చేసేందుకు వైసీపీ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంటే ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు మాని చేతనైతే ప్రజలకు సేవ చేయాలన్నారు. ఎన్నిక సమయంలో ముస్లింలకు ప్రత్యేక సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి  విస్మరించారని అన్నారు.  ఆర్‌డీఎస్‌, వేదవతి, గుండ్రేవుల, ఎల్లెల్సీ పనులు సాగాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాల్సిందే అని అన్నారు. మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత్‌ చార్జీలు, మూడుసార్లు బస్సు చార్జీలు,  పెట్రోల్‌, డీజిల్‌, ధరలు విపరీతంగా పెంచారన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి వాటర్‌గ్రిడ్‌ కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో  రూ.157 కోట్లు మంజూరయ్యాయని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ నిధులను   విడుదల చేసి  వాటర్‌ గ్రిడ్‌ పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చే శారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ నజీర్‌సాహెబ్‌, తిరుపతయ్యనాయుడు, మేజర్‌ సర్పంచ్‌ హైమావతి, రమే్‌షనాయుడు, బేతాలబడేసా, చంద్రశేఖర్‌, దరగల మాబు పాల్గొన్నారు.
ఉర్దూ పాఠశాలను పరిశీలించిన బీవీ: గోనెగండ్లలో శిఽథిలావస్థలకు చేరిన ఉర్దూ పాఠశాలను బీవీ పరిశీలించారు. శిఽథిలావ స్థకు చేరిన భవనంలోనే విద్యాబోధన సాగుతుందడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతం లో పెచ్చులు ఊడిపడి ఇద్దరు విద్యార్థులకు గాయాలు అయినా మరమ్మ తులు ఎందుకు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

Updated Date - 2022-07-07T07:03:49+05:30 IST