అచ్యుతాపురం బ్రాండిక్స్‌ సెజ్‌లో గ్యాస్ లీక్‌పై జగన్ ఆరా

ABN , First Publish Date - 2022-06-03T22:03:32+05:30 IST

అచ్యుతాపురం బ్రాండిక్స్‌ సెజ్‌లో గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. వాయువు లీక్‌పై దర్యాప్తుకు సీఎం ఆదేశించారు.

అచ్యుతాపురం బ్రాండిక్స్‌ సెజ్‌లో గ్యాస్ లీక్‌పై  జగన్ ఆరా

అమరావతి: అచ్యుతాపురం బ్రాండిక్స్‌ సెజ్‌లో గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. వాయువు లీక్‌పై దర్యాప్తుకు సీఎం ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనపై అధికారులను వివరణ కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. బాధితులకు భరోసా కల్పించాలని మంత్రి అమర్నాథ్‌కు ఆదేశించారు.


అచ్యుతాపురం బ్రాండిక్స్‌ సెజ్‌లో గ్యాస్ లీక్ తీవ్ర కలకలం రేపింది. క్వాంటం, సీడ్స్‌ యూనిట్‌లోకి ఒక్కసారిగా ఘాటైన వాయువు వెలువడింది. దీంతో పలువురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. సమీప పోరస్‌ కంపెనీ నుంచి వాయువు వెలువడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాంతులు, తల తిరుగుడుతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నలుగురు మహిళలకు సెజ్ యాజమాన్యం చికిత్స అందిస్తోంది. 

Updated Date - 2022-06-03T22:03:32+05:30 IST