జగనన్న విదేశీ విద్యాదీవెన పేరుతో పాత పథకానికి కొత్త మెరుగులు

ABN , First Publish Date - 2022-07-12T01:35:40+05:30 IST

జగనన్న విదేశీ విద్యాదీవెన పేరుతో పాత పథకానికి కొత్త మెరుగులు తిద్దారు. పేరు మార్చి సరికొత్త పథకం అంటూ జగన్‌ సర్కార్‌ గొప్పలు చెబుతోంది.

జగనన్న విదేశీ విద్యాదీవెన పేరుతో పాత పథకానికి కొత్త మెరుగులు

అమరావతి: జగనన్న విదేశీ విద్యాదీవెన పేరుతో పాత పథకానికి కొత్త మెరుగులు దిద్దారు. పేరు మార్చి సరికొత్త పథకం అంటూ జగన్‌ సర్కార్‌ గొప్పలు చెబుతోంది. ఇప్పటివరకు విదేశీ విద్యా పథకాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందుల్లో పడ్డారు. ప్రపంచంలోనే టాప్‌ 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థుల ఖర్చును భరిస్తామని ఏపీ సర్కార్‌ చెబుతోంది. టాప్‌ 100 ర్యాంక్‌లు ఉన్న యూనివర్సిటీలో సీటు సాధిస్తే.. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అంటూ ప్రభుత్వం వెల్లడించింది. ఏడాదికి రూ.8 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పథకం వర్తిస్తుంది. 35 ఏళ్లలోపు ఉన్నవారికే పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఏటా సెప్టెంబర్‌, డిసెంబర్‌, జనవరి, మే నెలల మధ్య నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2022-07-12T01:35:40+05:30 IST