జగనన్న స్కూల్‌ బ్యాగులు వచ్చేశాయ్‌..

ABN , First Publish Date - 2020-08-07T10:16:20+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించేందుకు జగనన్న విద్యాకానుక పేరిట ముద్రించిన బ్యాగులు జిల్లాకు వచ్చాయి. జిల్లాకు 3,17,000 బ్యాగులు అవసరమని విద్యాశాఖ గుర్తించింది. ఒకటి

జగనన్న స్కూల్‌ బ్యాగులు వచ్చేశాయ్‌..

విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించేందుకు జగనన్న విద్యాకానుక పేరిట ముద్రించిన బ్యాగులు జిల్లాకు వచ్చాయి. జిల్లాకు 3,17,000 బ్యాగులు అవసరమని విద్యాశాఖ గుర్తించింది. ఒకటి నుంచి మూడో తరగతి విద్యార్థుల వరకు చిన్న సైజు, నాలుగు నుంచి ఆరో తరగతి వరకు ఒక సైజు, ఏడు నుంచి పదో తరగతి వరకు పెద్ద బ్యాగు ఇవ్వనున్నారు. బాలురకు నేవీ బ్లూ, బాలికలకు స్కైబ్లూ రంగు బ్యాగులను అందజేయనున్నారు.


బ్యాగుతోపాటు మూడు జతల యూనిఫామ్‌ క్లాత్‌, జత షూస్‌, రెండు జతల సాక్సులు అందిస్తారు. అలాగే నోట్‌ పుస్తకాలతో పాటు బాలికలకు ఐదో తరగతి వరకు, బాలురకు అన్ని తరగతుల వారికి బెల్టులు అందజేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. నోట్‌ పుస్తకాలను ఆరేడు తరగతులకు ఎనిమిది, ఎనిమిదికి ఐదు, తొమ్మిదో తరగతికి 12, పదో తరగతి విద్యార్థులకు 14 లాంగ్‌ సైజు నోట్‌ పుస్తకాలను అందజేస్తారు. ప్రస్తుతం పాఠశాలలు తెరవకపోయినా బ్యాగులు, ఇతర మెటీరియల్‌ ఆయా పాఠశాలలకు చేరే ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2020-08-07T10:16:20+05:30 IST