జగన్‌ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనని: అనిల్‌

ABN , First Publish Date - 2022-04-18T00:31:41+05:30 IST

సీఎం జగన్‌ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నెల్లూరు పట్టణం గాంధీబొమ్మ

జగన్‌ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనని: అనిల్‌

నెల్లూరు: సీఎం జగన్‌ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నెల్లూరు పట్టణం గాంధీబొమ్మ సెంటర్‌లో అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. మంత్రిగా కంటే జగన్‌ సైనికుడిగా ఉండటమే తనకిష్టమన్నారు. నెల్లూరు ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. జిల్లాలో వర్గాలు ఉండవని, ఉన్నది జగన్‌ వర్గం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఆత్మీయ సభ ఎవరికీ పోటీ కాదన్నారు. 2024లో వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తామని అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రకటించారు.

Updated Date - 2022-04-18T00:31:41+05:30 IST