Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 20 Aug 2022 10:38:08 IST

సీజేఐను కలిసిన జగన్, చంద్రబాబు.. ఆసక్తికర విషయం ఏంటంటే..

twitter-iconwatsapp-iconfb-icon
సీజేఐను కలిసిన జగన్, చంద్రబాబు.. ఆసక్తికర విషయం ఏంటంటే..

Vijayawada : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(Acharya Nagarjuna University)లో లా కోర్సును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ(CJI NV Ramana) పూర్తి చేశారు. లా కోర్సు చదివిన చోటే శనివారం గౌరవ డాక్టరేట్‌ అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ విజయవాడకు వచ్చారు. నోవాటెల్ హోటల్‌(Novatel Hotel)లో బస చేశారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా ఏపీ సీఎం జగన్(AP CM Jagan) తన సతీమణితో వెళ్లి ఎన్వీ రమణను కలిశారు. ఆయనతో 20 నిమిషాల పాటు భేటి అయ్యారు. ఆ తరువాత వెంటనే అంటే జగన్ వెళ్లీ వెళ్లక ముందే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అక్కడకు చేరుకున్నారు. 


ఆసక్తికర విషయం ఏంటంటే.. వీరిద్దరి కాన్వాయ్‌లు ఎదురెదురు పడకుండా చూసుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. నోవోటెల్ హోటల్ సెల్లార్ మార్గం ద్వారా వెళ్లి సీజేఐని కలిసి అదే మార్గంలో తిరిగి సీఎం వెళ్లిపోయేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అలాగే చంద్రబాబు హోటల్ ప్రధాన ద్వారం పోర్టుకో ద్వారా వెళ్లి కలిసి తిరిగి వెళ్లేలా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి ఇద్దరూ ఎదురెదురు పడకుండా చర్యలైతే తీసుకోగలిగారు. చంద్రబాబు సైతం 20 నిమిషాల సేపు జస్టిస్ రమణతో సమావేశమయ్యారు. చంద్రబాబుతో పాటు వెళ్లి సీజేఐను కలిసిన వారిలో తెలుగుదేశం నేతలు ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్(MP Kanakamedala Ravindra Kumar), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్(MLA Gadde Rammohan), ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడు(MLC Batchula Arjunudu) ఉన్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.