TS News: ఈడీ, బోడీలకు భయపడే ప్రసక్తే లేదు: జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-14T21:49:00+05:30 IST

ఈడీ, బోడీలకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఈడీని బీజేపీ

TS News: ఈడీ, బోడీలకు భయపడే ప్రసక్తే లేదు: జగదీష్‌రెడ్డి

నల్లగొండ: ఈడీ, బోడీలకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఈడీని బీజేపీ (BJP) జేబు సంస్థగా మార్చుకుందని దుయ్యబట్టారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ దుర్మార్గాలను బయటపెట్టే సత్తా సీఎం కేసీఆర్‌ (CM KCR)కే ఉందని చెప్పారు. వామపక్షాలు తమతో కలిసి వస్తాయని ఆశిస్తున్నామని జగదీష్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.


మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక (Munugodu by-election)ను కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న కీలక ఎన్నిక అయినందున.. ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు తాను కొంత దూరంగా ఉండడంతో పార్టీకి నష్టం జరిగిందన్న ఉద్దేశంతో ఉన్న కేసీఆర్‌.. మరోసారి దానిని పునరావృతం కానివ్వొద్దని పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం అసంతృప్తులను బుజ్జగించడం నుంచి ప్రచార పర్వం దాకా అన్నింట్లోనూ ఆయనే ముందుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తొలుత పార్టీ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వంపై వస్తున్న అసంతృప్తిని చల్లార్చేందుకు స్వయంగా రంగంలోకి దిగారు.

Updated Date - 2022-08-14T21:49:00+05:30 IST