Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘రింగ్ మాస్టర్లను టీఆర్ఎస్ కార్యకర్తలు గమనించాలి’

హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ డ్రామాను, రింగ్ మాస్టర్లను టీఆర్ఎస్ కార్యకర్తలు గమనించాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. ధాన్యం పండించింది మనం, కొనాల్సింది కేంద్రం, కానీ బీజేపీ, కాంగ్రెస్‌లు ధాన్యం కొనాలని పోటీ పడి స్టేట్ మెంట్ ఇస్తున్నాయని మండిపడ్డారు. దొంగతనం చేసి దొంగ దొంగ అరుస్తున్నట్టు ఉంది బీజేపీ పరిస్థితి అని విమర్శించారు. ఎంపీ ఉత్తమ్ పార్లమెంట్‌లో మాట్లాడిన తీరు అస్సలు బాగాలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ధాన్యం కొనమని అడగాల్సింది పోయి, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనేలా చూడమని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో భారీగా పండిన వరి ధాన్యాన్ని చూసి కొనకుండా కుక్కల్లా అరుస్తున్నారు బీజీపీ నేతలని విమర్శించారు. నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితం ప్రతిపక్షాలకు చెంప పెట్టులా ఉండాలన్నారు. 

Advertisement
Advertisement