జడేజా.. నెం.1 ఆల్‌రౌండర్‌

ABN , First Publish Date - 2021-06-24T08:31:10+05:30 IST

టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు.

జడేజా.. నెం.1 ఆల్‌రౌండర్‌

దుబాయ్‌: టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో జడేజా ఆల్‌రౌండర్ల జాబితాలో 386 పాయింట్లతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకోగా, జాసన్‌ హోల్డర్‌ (384) రెండో ర్యాంక్‌కు పరిమితమయ్యాడు. జడేజా టాప్‌ర్యాంక్‌లో నిలవడం 2017 ఆగస్టు తర్వాత ఇదే తొలిసారి. బెన్‌ స్టోక్స్‌ (377) మూడు, రవిచంద్రన్‌ అశ్విన్‌ (353) నాలుగు, షకీబల్‌ హసన్‌ (338) ఐదోస్థానంలో ఉన్నారు. బౌలర్లలో అశ్విన్‌ రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, కమిన్స్‌ టాపర్‌గా కొనసాగుతున్నాడు. బ్యాట్స్‌మెన్‌ జాబితాలో స్మిత్‌, విలియమ్సన్‌, లబుషేన్‌, కోహ్లీ, రూట్‌ టాప్‌-5 ర్యాంకుల్లో మార్పులేదు.  

Updated Date - 2021-06-24T08:31:10+05:30 IST