Abn logo
Jan 27 2021 @ 00:31AM

అంబేద్కర్‌ జెండా ఎగురవేస్తాం

మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్‌కుమార్‌ 

 బాపట్ల, జనవరి 26 : రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అంబేద్కర్‌ జెండా ఎగురవేస్తామని జైభీమ్‌ యాక్సస్‌ జస్టిస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి  జడ శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు.  మంగళవారం బాపట్ల పట్టణంలోని అంటరానితన నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో దళితుల ఆత్మీయ కలయిక సభకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.  ఏఎన్‌పీఎస్‌ రాష్ర్టాధ్యక్షుడు చార్వాక అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో జడ శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో  దళిత బహజనులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగాయన్నారు. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌పార్టీ రాష్ర్టాధ్యక్షుడు బషీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ దళితులకు మేనమామను అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు.  కార్యక్రమంలో ఏపీజెఎఫ్‌ రాష్ర్టాధ్యక్షుడు కృష్ణాంజనేయులు, జేఏజే నాయకులు కొండలురావు, చింతా వెంకటేశ్వర్లు, సురేష్‌కుమార్‌, గుంటూరు జిల్లా అధ్యక్షులు బడుగు భరత్‌, గురవయ్య, మహిళనాయకులు రూప సుమ, మేరీ, న్యాయవాది సుజాత, వికాస్‌, మదు తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement