దబాంగ్ టూర్ నుంచి Jacqueline Fernandez తొలగింపు

సల్మాన్ ఖాన్ దబాంగ్ టూర్ నుంచి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను తప్పించారు.  సౌదీ అరేబియాలోని రియాద్‌లో ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో ఆమె పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈ‌డీ) నుంచి మనీ లాండరింగ్ ఆరోపణలను జాక్వెలిన్ ఎదుర్కొంటుంది. అందువల్ల దబాంగ్ టూర్‌ రీ లోడెడ్‌లో ఆమె పాల్గొనడం లేదు.


సుఖేశ్ చంద్ర‌శేఖర్ అనే వ్యక్తితో ఆమె అనేక లావాదేవీలు జరిపిందనే ఆరోపణాలున్నాయి. తాజాగా వీరిద్దరూ సన్నిహితంగా మెలిగిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8న ఈడీ ముందు విచారణకు ఆమె హాజరయింది. ఈడీ విచారణను ఆమె అనేక సార్లు ఎదుర్కొవాల్సి వస్తుందనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో జాక్వెలిన్‌కు బదులుగా డైసీ షాను ఆమె స్థానంలోకి తీసుకున్నారని బీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


దబాంగ్ టూర్ రీలోడెడ్ డిసెంబర్ 10న సౌదీ అరేబియాలోని రియాద్‌లో ప్రారంభమవుతోంది. సల్మాన్ ఖాన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ‘‘ రియాద్‌‌లో దబాంగ్ టూర్ రీ లోడెడ్ డిసెంబర్ 10న ప్రారంభమవుతోంది. ఈ ఏడాదిలో జరగబోయే అతి పెద్ద ఈవెంట్‌కు మీరు సిద్ధంగా ఉన్నారా ’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో సల్మాన్ ఖాన్ మెసేజ్ షేర్ చేశాడు. 

Advertisement

Bollywoodమరిన్ని...