బీసీసీఐకి జాక్‌పాట్‌

ABN , First Publish Date - 2022-06-15T10:07:59+05:30 IST

ఐపీఎల్‌ మీడియా హక్కుల వేలంలో బీసీసీఐ జాక్‌పాట్‌ కొట్టింది. ఐదేళ్ల కాలానికి (2023-27)గాను మూడు రోజులపాటు నిర్వహించిన వేలం మంగళవారంతో

బీసీసీఐకి జాక్‌పాట్‌

ఒక్కో మ్యాచ్‌ విలువ రూ. 118 కోట్లు

రూ. 48,390 కోట్ల రికార్డు ధరకు ఐపీఎల్‌ మీడియా హక్కులు

 టీవీ హక్కులు మళ్లీ స్టార్‌కే

డిజిటల్‌లో వయాకామ్‌-18 జోరు


న్యూఢిల్లీ: ఐపీఎల్‌ మీడియా హక్కుల వేలంలో బీసీసీఐ జాక్‌పాట్‌ కొట్టింది. ఐదేళ్ల కాలానికి (2023-27)గాను మూడు రోజులపాటు నిర్వహించిన వేలం మంగళవారంతో ముగిసింది. ఆన్‌లైన్‌ వేలంద్వారా బీసీసీఐ అనూహ్యంగా రూ. 48,390 కోట్ల (410 మ్యాచ్‌లకు) భారీ ఆదాయాన్ని ఆర్జించింది. వేలం విజేతలను ప్యాకేజీల వారీగా బోర్డు ప్రకటించింది. అయితే, టీవీతో డిజిటల్‌ హక్కులు పోటీపడడం మారుతున్న ట్రెండ్‌కు అద్దం పడుతోంది. దీన్ని ముందుగానే అంచనా వేసిన బీసీసీఐ.. నాలుగు ప్యాకేజీలుగా వేలం నిర్వహించి భారీ లాభాన్ని గడించడంలో సూపర్‌ సక్సెస్‌ అయింది. 2017లో స్టార్‌ ఇండియా ఐదేళ్ల కాలానికిగాను రూ. 16,347 కోట్లతో ఐపీఎల్‌ టీవీ, డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకొంటే.. ఈసారి ఆ మొత్తం దాదాపు మూడు రెట్ల రూ. 47066 (ఎ+బి+సి ప్యాకేజీలు)కు పెరిగింది. ఓవరాల్‌గా మెగా లీగ్‌లో స్టార్‌ ఇండియా హవాకు ఈసారి వయాకామ్‌ గండికొట్టింది. సీజన్‌ సీజన్‌కూ అదరగొడుతున్న ఐపీఎల్‌.. రికార్డు ధరతో ప్రపంచ ప్రఖ్యాత లీగుల్లో రెండో స్థానానికి ఎగబాకింది. 


ఎవరెవరికి ఏమేం దక్కాయంటే...

  • ప్యాకేజీ ‘ఎ’ కింద భారత ఉపఖండంలో టెలివిజన్‌ ప్రసార హక్కుల్ని రూ. 23,575 కోట్లకు డిస్నీ స్టార్‌ సొంతం చేసుకొంది.
  • ప్యాకేజీ ‘బి’తో భారత ఉపఖండంలో డిజిటల్‌ ప్రసార హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18 సంస్థ రూ. 20,500 కోట్లకు దక్కించుకొంది. 
  • ప్యాకేజీ ‘సి’ని కూడా వయాకామ్‌ 18 సంస్థ రూ. 2991 కోట్లకు ఖరీదు చేసింది. వీకెండ్‌లో జరిగే నైట్‌ మ్యాచ్‌లు, ప్లేఆ్‌ఫ్సతో కలిపి మొత్తం 98 మ్యాచ్‌ల డిజిటల్‌ హక్కులు ఈ ప్యాకేజీలో ఉన్నాయి.
  • భారత ఉపఖండం బయట ప్రపంచ దేశాల్లో టీవీ, డిజిటల్‌ హక్కుల కోసం నిర్వహించిన ‘డి’ ప్యాకేజీని వేలంలో వయాకామ్‌ 18, టైమ్స్‌ ఇంటర్‌నెట్‌ సంయుక్తంగా రూ. 1324 కోట్లకు సొంతం చేసుకున్నాయి. ఈ ప్యాకేజీ కనీస ధర రూ. 3 కోట్లు కాగా.. 1321 కోట్లు ఆదనంగా పలకడం విశేషం.. 


బిడ్డింగ్‌ ప్రక్రియ ఇలా..

‘ఎ’ ప్యాకేజీ ప్రకారం భారత ఉపఖండంలో టీవీ హక్కులు, ‘బి’ ప్యాకేజీ కింద భారత ఉపఖండంలో డిజిటల్‌ రైట్స్‌, ‘సి’లో ప్లేఆఫ్స్‌ సహా 98 మ్యాచ్‌లకు డిజిటల్‌ హక్కులు, ‘డి’ ప్యాకేజీని భారత ఉపఖండం మినహా మిగతా దేశాల్లో టీవీ, డిజిటల్‌ హక్కుల కోసం నిర్వహించారు. 


మ్యాచ్‌కు రూ. 118 కోట్లు

ఐపీఎల్‌ మ్యాచ్‌ విలువ గతంతో పోల్చితే వంద శాతానికిపైగా పెరి గింది. గతంలో ఒక మ్యాచ్‌ విలువ రూ. 54.5 కోట్లు అయితే.. రాబోయే సీజన్‌లో అది రూ. 118 కోట్లకు చేరింది. ఒక మ్యాచ్‌ విలువ వంద కోట్లు దాటడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లీగ్‌ల్లో రెండోది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ (ఎన్‌ఎ్‌ఫఎల్‌) టాప్‌లో ఉంది. ఇందులో ఒక్కో మ్యాచ్‌ విలువ రూ. 133 కోట్లు.

Updated Date - 2022-06-15T10:07:59+05:30 IST