Sep 25 2021 @ 17:23PM

బిగ్‌బీ KBC షోలో జాకీష్రాఫ్, సునీల్ శెట్టి హంగామా.. ఇంట్లో ఆతిథ్యం గురించి ఆసక్తికర కామెంట్స్..

ముంబై: బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహారిస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ)-13వ సీజన్‌కు సునీల్ శెట్టి, జాకీష్రాఫ్ అతిథులుగా విచ్చేశారు. ఈ షోలో భాగంగా తమ మధ్య ఉన్న స్నేహం గురించి బిగ్‌బీకి వివరించారు. సునీల్‌శెట్టి తన ఇంట్లో జాకీష్రాఫ్‌కు అతిథ్యమిచ్చారన్నారు. అనంతరం ఆ ఇంటి గురించి జాకీష్రాఫ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ బాలీవుడ్ నటులు పాల్గొన్న ఎపిసోడ్ ‘‘ షాన్‌దార్ శుక్రవార్’’ పేరిట శుక్రవారం ప్రసారం అయింది.  


ఆరు పదుల వయసులో ఉన్న ఈ బాలీవుడ్ నటులు షోలో ఫుష్ఆప్స్ తీసి తమలో సామర్థ్యం ఇంకా తగ్గలేదని నిరూపించారు. ఒకరి గురించి మరొకరు బిగ్‌బీకి వివరించారు. జాకీష్రాఫ్ మాట్లాడుతూ..తనకు సునీల్ అతిథ్యం ఇచ్చారన్నారు. తన తండ్రి చికిత్స కోసం సునీల్ ఇల్లును ఇచ్చిన విధానం గురించి చెప్పుకొచ్చారు.  సునీల్ మాట్లాడుతూ..జాకీష్రాఫ్‌కు మంచి ఫ్యాషన్ సెన్స్ ఉందన్నారు.  మీరు ఏవిధంగా మిత్రులయ్యారని బిగ్‌బీ ప్రశ్నించగా ..మేం ఒకే పాఠశాలలో చదువుకున్నాం అని చెప్పారు. ఆ రోజుల్లో తను మోడల్‌గా చేశానని, సునీల్ దుస్తులు కూడా వేసుకునేవాడినని జాకీష్రాఫ్ చెప్పారు.


తలసేమియా గురించి అవగాహన కల్పించడం, నిధులను సమీకరించేందుకు ఈ షోలో పాల్గొన్నారు. తలసేమిక్ ఇండియా అనే సంస్థకు సహాయం చేయడానికి జాకీష్రాఫ్ ఈ షోకు వచ్చారు. ఈ సంస్థ తలసేమియా బాధితుల వైద్యావసరాలు తీరుస్తోంది. రియాలిటీ షోలో పాల్గొని వారు రూ. 25లక్షలు గెల్చుకున్నారు. ఈ నిధులను ఆ సంస్థకు అందించనున్నారు. 


Bollywoodమరిన్ని...