రామాల‌యం కోసం ఊర్మిళ ప్రతిజ్ఞ... 28 ఏళ్లుగా అన్నం మానేసి...

ABN , First Publish Date - 2020-08-02T11:42:43+05:30 IST

అయోధ్య‌లో రామాలయ నిర్మాణం కోసం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌న‌కు చెందిన ఒక మ‌హిళ చేప‌ట్టిన దీక్ష ఫ‌లప్ర‌ద‌మ‌య్యింది. 28 సంవత్సరాల క్రితం రామాల‌య నిర్మాణం విష‌యంలో, వివాదం త‌లెత్తిన...

రామాల‌యం కోసం ఊర్మిళ ప్రతిజ్ఞ...  28 ఏళ్లుగా అన్నం మానేసి...

జ‌బ‌ల్‌పూర్‌: అయోధ్య‌లో రామాలయ నిర్మాణం కోసం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌న‌కు చెందిన ఒక మ‌హిళ చేప‌ట్టిన దీక్ష ఫ‌లప్ర‌ద‌మ‌య్యింది.  28 సంవత్సరాల క్రితం రామాల‌య నిర్మాణం విష‌యంలో, వివాదం త‌లెత్తిన నేప‌ధ్యంలో ఆమె తాను రామాల‌య నిర్మాణం ప్రారంభమయ్యే వరకు అన్నం ముట్ట‌న‌ని  ప్రతిజ్ఞ చేసి, దానిని నిల‌బెట్ట‌కున్నారు. ఇప్పుడు ఆగస్టు 5 న రామాల‌య‌ నిర్మాణానికి భూమిపూజ జ‌రుగుతున్నందుకు సంతోషంగా ఉంద‌ని అల‌నాడు ప్రతిజ్ఞ చేసిన ఊర్మిళ‌ చతుర్వేది తెలిపారు. 1992లో అయోధ్యలో అల్ల‌ర్లు చెల‌రేగిన స‌మ‌యంలో ఊర్మిళా చతుర్వేది వయసు 53 సంవత్సరాలు. ఈ ఘ‌ట‌న‌తో తీవ్రంగా క‌ల‌త చెందిన ఆమె అయోధ్యలో రామాల‌య నిర్మాణం జ‌రిగేవ‌ర‌కూ ముద్ద ముట్టేది లేద‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే ప‌లుమార్లు కుటుంబ స‌భ్యులు ఆమెను అన్నం తిన‌మ‌ని బ‌తిమాలిన‌ప్ప‌టికీ, ఆమె వారి మాట విన‌లేదు. పండ్లు మాత్ర‌మే తింటూ, ఇంట్లో రామ‌ద‌ర్బార్ ఏర్పాటు చేసుకుని, రామ‌నామ జపం చేసుకుంటూ కాలం గ‌డుపుతున్నారు. ఆగ‌స్టు 5న అయోధ్య‌లో జ‌రిగే ఆల‌య నిర్మాణ భూమి పూజ‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో చూసిన అనంత‌రం త‌న దీక్ష‌ను విర‌మిస్తాన‌ని ఊర్మిళ తెలిపారు.

Updated Date - 2020-08-02T11:42:43+05:30 IST