గజగజలాడుతున్న అమెరికా.. ఏకంగా 1200 విమానాల రద్దు..!

ABN , First Publish Date - 2022-01-18T22:03:37+05:30 IST

ప్రకృతి ప్రతాపానికి అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం గజగజలాడిపోతోంది. చలి తుఫాను(ఇజ్జీ) కారణంగా అమెరికా ఆగ్నేయ ప్రాంతంలోని పలు రాష్ట్రాల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.

గజగజలాడుతున్న అమెరికా.. ఏకంగా 1200 విమానాల రద్దు..!

ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి ప్రతాపానికి అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం గజగజలాడిపోతోంది. చలి తుఫాను(ఇజ్జీ) కారణంగా అమెరికా ఆగ్నేయ ప్రాంతంలోని పలు రాష్ట్రాల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన చలి, పెనుగాలులు, హిమపాతంతో ప్రజా జీవనం అస్థవ్యస్థమైపోయింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. చెట్లు కూలడం, రహదారులన్నీ మంచుతో నిండిపోవడంతో  రోడ్డు ప్రమాదాలు కూడా సంభవించాయి. మంచు తుఫాను దృష్ట్యా జార్జియా, ఉత్తర కెరొలీనా, దక్షిణ కెరొలీనా, ఫ్లోరిడా రాష్ట్రాల గవర్నర్లు ఆదివారం అత్యయిత స్థితిని ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. 


కాగా.. ఉత్తరకెరొలీనాలోని షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి ప్రయాణించాల్సిన 1200 విమానాలను అధికారులు రద్దు చేశారు. ఒకానొక సమయంలో అమెరికాలో ఆగ్నేయం ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా దాదాపు 50 వేల మంది అవస్థలు ఎదుర్కొన్నారు. ఇజ్జీ తీవ్రతకు ఉత్తరకెరొలీనా ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇక ఫ్లోరిడా రాష్ట్రంలో తెలెత్తిన సుడిగాలి కారణంగా 30కి పైగా ఇళ్లు నాశనమైపోయాయి. ఉత్తరకెరొలీనాలో అత్యధికంగా 15.5 అంగుళాల మేర హిమపాతం కురిసింది. 

Updated Date - 2022-01-18T22:03:37+05:30 IST