కేరళ మంత్రి వివాహంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముస్లిం లీగ్ నేత

ABN , First Publish Date - 2021-12-12T01:09:45+05:30 IST

ఇస్లాం మతంలో ప్రాథమిక విలువలు పాటించడం చాలా ముఖ్యమైంది. ముస్లింలు ఎలాంటి కార్యంలోనైనా ఇస్లాం విధివిధానాల్ని కచ్చితంగా పాటించి తీరాలి. కానీ కమ్యూనిస్ట్‌లు ఇస్లామిక్ విధానాన్ని పాటించడం లేదు..

కేరళ మంత్రి వివాహంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముస్లిం లీగ్ నేత

తిరువనంతపురం: కేరళ మంత్రి రియాస్, ముఖ్యమంత్రి తనయ వీణా పెళ్లిపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎమ్ఎల్) నేత అబ్దురెహ్మాన్ కల్లై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారి వివాహాన్ని ‘అక్రమ సంబంధం’ అంటూ తీవ్ర అభ్యంతరకర స్థాయిలో స్పందించారు. అనంతరం తీవ్ర దుమారం రేగడంతో తన వ్యాఖ్యలకు క్షమాపన కూడా చెబుతున్నట్లు ప్రకటించారు. ‘‘ఏ మతాన్ని కానీ, వ్యక్తిగత జీవితాన్ని కానీ, కుటుంబాన్ని కానీ కించపర్చాలనే ఉద్దేశం నాకు లేదు. నా వ్యాఖ్యలపై పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నాను. క్షమాపణలు కోరుకుంటున్నాను’’ అని అబ్దురెహ్మాన్ కల్లై అన్నారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఇస్లాం మతంలో ప్రాథమిక విలువలు పాటించడం చాలా ముఖ్యమైంది. ముస్లింలు ఎలాంటి కార్యంలోనైనా ఇస్లాం విధివిధానాల్ని కచ్చితంగా పాటించి తీరాలి. కానీ కమ్యూనిస్ట్‌లు ఇస్లామిక్ విధానాన్ని పాటించడం లేదు’’ అని చెప్పుకొచ్చారు. అయితే కల్లై వ్యాఖ్యలపై మంత్రి మహ్మద్ రియాస్ విచారం వ్యక్తం చేశారు.


పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌తో డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేత మహ్మద్ రియాస్ వివాహం జూన్ 15, 2020న జరిగింది. సీఎం విజయన్ ఇంట్లోనే అతికొద్ది మంది అతిథుల నడుమ ఈ వివాహం జరిగింది.

Updated Date - 2021-12-12T01:09:45+05:30 IST