Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 29 Jan 2022 05:20:30 IST

ఇది అమ్మాయిల దండుపాళ్యం

twitter-iconwatsapp-iconfb-icon
ఇది అమ్మాయిల దండుపాళ్యం

రాగిణి ద్వివేది, మేఘనా రాజ్‌ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘రియల్‌ దండుపాళ్యం’. మహేశ్‌ దర్శకత్వంలో సి. పుట్టస్వామి నిర్మించారు. ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా సి పుట్టస్వామి మాట్లాడుతూ  ‘తెలుగు, కన్నడ భాషల్లో ‘దండుపాళ్యం’ సిరీస్‌ సక్సెస్‌ అయింది. ‘రియల్‌ దండుపాళ్యం’ వాటిని మించేలా ఉంటుంది. మగాళ్ల వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ ‘రియల్‌ దండుపాళ్యం’ అన్నారు. నటి రాగిణి ద్వివేది మాట్లాడుతూ ‘నేను నటించిన చిత్రం తెలుగులో విడుదలవడం ఇదే తొలిసారి. సవాల్‌గా తీసుకొని ఈ సినిమాను చేశాను’ అని చెప్పారు. ‘ప్రతి మహిళా ఈ సినిమా చూడాలి. ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలి’ అని పర్వతారోహకురాలు మాలోవత్‌ పూర్ణ అన్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశామని చిత్ర దర్శకుడు చెప్పారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement