త్రీ వీలర్ ఎలక్ట్రిక్ రంగంలోకి ఇట్రియో

ABN , First Publish Date - 2020-10-21T00:55:11+05:30 IST

దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విద్యుత్‌ వాహన స్టార్టప్‌ – ఇట్రియో విద్యుత్ వాహన రంగంలోకి ప్రవేశించనుంది. ఇంట్రాసిటీ లాజిస్టిక్స్‌ను విద్యుతీకరించాలనే లక్ష్యంతో ..

త్రీ వీలర్ ఎలక్ట్రిక్ రంగంలోకి ఇట్రియో

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విద్యుత్‌ వాహన స్టార్టప్‌ – ఇట్రియో విద్యుత్ వాహన రంగంలోకి ప్రవేశించనుంది. ఇంట్రాసిటీ లాజిస్టిక్స్‌ను విద్యుతీకరించాలనే లక్ష్యంతో నూతన విద్యుత్‌ త్రిచక్ర వాహన శ్రేణి ఉత్పత్తులను తమ బ్రాండ్‌ టౌరో పేరిట ఆవిష్కరించనుంది. కార్గో విభాగాపు అవసరాలను తీరుస్తూ ఈ రెండు నూతన వేరియంట్లు, ఇప్పుడు అధికంగా ఇంట్రాసిటీ లాజిస్టిక్స్‌పై దృష్టి కేంద్రీకరించాయి.  త్రిచక్ర వాహనాల ప్యాసెంజర్‌ వేరియంట్స్‌ త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ ఆవిష్కరణలను సాధ్యం చేయడానికి ఇట్రియో గత నెలలో 3 మిలియన్‌ డాలర్లను సమీకరించింది.


పోర్చుగ్రీస్‌ పదం టోరో నుంచి టౌరో ఉద్భవించింది. దీని అర్ధం ఎద్దు అని ! ఈ కారణం చేతనే ఈ వాహన డిజైన్‌ సిద్ధాంతం.. ఎద్దులాగానే శక్తివంతమైన బాడీ, సాటిలేని శక్తి, అసాధారణ బరువులను తీసుకువెళ్లే సామర్థ్యం, తీక్షణమైన స్థిరత్వం కలిగి ఉంటుందనేది కంపెనీ నినాదం. టౌరో వాహనాలు, ఎద్దు స్ఫూర్తితో సిగ్నేచర్‌ ఫ్రంట్‌ గ్రిల్‌తో వస్తాయి. అంతేకాకుండా ఇట్రియో తయారీ బ్రేక్‌ డ్రమ్‌లతో వస్తాయి. ఈ కంపెనీ పూర్తిగా తమ టౌరో ఫ్యామిలీ వాహనాలను స్వదేశీయంగా తయారుచేయడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలను పొందేందుకు అర్హత సాధిస్తుంది.


ఇట్రియో ఇప్పుడు బీ2బీ వినియోగదారులు అయినటువంటి లెట్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌, అమెజాన్‌, బిగ్‌బాస్కెట్‌, ఐకియా మొదలైన వాటితో కలిసి పనిచేస్తుంది. తద్వారా వారి నిర్వహణ అవసరాలకు తగినట్లుగా వాహనాలను రూపొందించి అందిస్తుంది. ఈ ఉత్పత్తులకు స్థిరమైన ధర అంటూ ఏమీ లేదు. బ్యాటరీ కెమిస్ట్రీ, పేలోడ్‌ అవసరాలు, క్యూబిక్‌ సామర్థ్యం, ప్రతి రోజూ తిరిగే కిలోమీటర్లు వంటి అంశాలపై ధరలు నిర్ణయమవుతాయి.


టౌరో మ్యాక్స్‌, మినీ వాహనాలు అమ్మకాలు.. లీజు అవకాశాలలో లభ్యమవుతాయి. ఈ కంపెనీ ఇప్పుడు లీజుపై కూడా సంస్థలకు వాహనాలను 50 యూనిట్లు లేదా అంతకు మించిన వాహనాలను కనీసం మూడేళ్ల కాలానికి లీజుకు అందించనుంది. నెలకు 500 యూనిట్లను తయారుచేసే సామర్థ్యం ఉంది.  అమ్మకాలు, లీజింగ్‌ నమూనా ద్వారా దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించేందుకు ఇప్పుడు టౌరో ప్రయత్నిస్తోంది.


ప్రస్తుతం, హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో సుప్రసిద్ధ ఈ–కామర్స్‌ లాజిస్టిక్స్‌ వద్ద టౌరో పైలెట్‌ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇట్రియో ఇప్పుడు దేశవ్యాప్తంగా తమ పాదముద్రికలను రాబోయే కొద్ది నెలల్లో విస్తరించడానికి   ప్రణాళిక చేసింది. నూతన ఎలక్ట్రిక్‌ త్రి వీలర్ వాహనాలలోని నూతన వేరియంట్లను రాబోయే కొద్ది నెలల్లో ఆవిష్కరించనున్నారు. దీనితో పాటుగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాలలో తమ డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ను కంపెనీ ఏర్పాటుచేయనుంది.


బ్యాటరీ ధరలు గణణీయంగా తగ్గడంతో పాటుగా తెలంగాణా, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ఆకర్షణీయమైన ఈవీ విధానాలు వంటివి, దేశవ్యాప్తంగా గ్రీన్‌ మొబిలిటీ వైపు వేగంగా పయణించేందుకు తోడ్పడుతున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని మరియు క్రిసిల్‌చేసిన తాజా అధ్యయనంతో 2024 నాటికి 50% నూతన త్రి చక్ర వాహనాలు విద్యుతీకరించబడనున్నాయి. ఇట్రియో ఇప్పుడు మరింతగా సర్క్యులర్‌ ఎకనమీని తమ విప్లవాత్మక ఉత్పత్తులు అయినటువంటి టౌరో ద్వారా ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది.

Updated Date - 2020-10-21T00:55:11+05:30 IST