ఐటీఐకి ఆదరణ కరువు

ABN , First Publish Date - 2021-07-26T05:11:04+05:30 IST

పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు.

ఐటీఐకి ఆదరణ కరువు
నెల్లూరు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ ఐటీఐ

ముగిసిన దరఖాస్తుల గడువు

31 ఐటీఐల్లో సీట్లు మొత్తం 4,448

అప్లై చేసుకున్నది 610 మందే


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జూలై 25: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఈ విద్యాసంవత్సరానికి ఐటీఐల్లో చేరేందుకు ధరఖాస్తు గడువు ఈ నెల 25వ తేదీతో ముగిసింది. జిల్లాలోని 31 ఐటీఐల్లో 4448 సీట్లు ఉండగా, 610 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.


మార్కుల జాబితా కోసం ఎదురుచూపు

కరోనా కారణంగా గత విద్యాసంవత్సరంలో పది పరీక్షలకు ధరఖాస్తు చేసుకున్నవారంతా పాస్‌ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.  అయితే టెన్త్‌ మార్కుల లిస్టు ఇంతవరకు ఇవ్వలేదు. వాటి కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఐటీఐలకు ఎక్కువుగా విద్యార్ధులు దరఖాస్తు చేసుకోకపోవడానికి ఇదే కారణంగా తెలుస్తున్నది. మార్కులిస్టులు జారీ చేసిన తర్వాత ఐటీఐలలో చేరేందుకు మరో అవకాశం కల్పిస్తే మరి  కొందరు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 

Updated Date - 2021-07-26T05:11:04+05:30 IST