Abn logo
Dec 6 2020 @ 00:17AM

ఐటీఐలలో ప్రవేశాలకు 12 వరకూ గడువు

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 5 : జిల్లాలోని ఆరు ప్రభుత్వ ఐటీఐలు, 33 ప్రైవేటు ఐటీఐలలో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి మూడో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ను ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తున్నట్లు సత్రంపాడు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ పి.రజిత తెలిపారు. విద్యార్థులు జ్టీజీ.ుఽజీఛి.జీుఽ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి ఈనెల 5వ తేదీ నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐలలో అడ్మిషన్లకు దరఖాస్తులు సమర్పించిన విద్యార్థులకు ఈనెల 15, 16 తేదీల్లోనూ, ప్రైవేటు ఐటీఐలలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న విద్యా ర్థులకు 17, 18 తేదీల్లోనూ కౌన్సెలింగ్‌ జరుగుతుందని, తగిన ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేసేటప్పుడు ఎటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు పాటించాలని, కౌన్సెలింగ్‌ సమ యంలోనూ, ధ్రువపత్రాల పరిశీలనలోనూ దరఖాస్తు వివరాలు సక్రమంగా లేనట్లు గమనిస్తే అడ్మిషన్‌ పొందేందుకు అనర్హులవు తారని హెచ్చరించారు. జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలలో 1068 సీట్లు ఉండగా, ఇప్పటి వరకూ నిర్వహించిన కౌన్సెలింగ్‌లలో 50 శాతం భర్తీ అయ్యాయని, ప్రైవేటు ఐటీఐ లలో 5136 సీట్లు ఉండగా, 12 శాతమే భర్తీ అయ్యాయని వివరించారు.  వివరాలకు ప్రభుత్వ ఐటీఐ కార్యాలయం ఫోన్‌ నెంబర్‌ 08812–230269లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. 


Advertisement
Advertisement
Advertisement