12లోపు ఐటీఐలో ఖాళీలకు దరఖాస్తులు చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-06T04:50:47+05:30 IST

రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఈనెల 12వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

12లోపు ఐటీఐలో ఖాళీలకు దరఖాస్తులు చేసుకోవాలి

రాజంపేట, డిసెంబరు5 : రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఈనెల 12వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను ఈనెల 15వ తేదీన రాజంపేటలో జరిగే కౌన్సెలింగ్‌కు తీసుకురావాలన్నారు. ఐటీఐలో కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ అండ్‌ ప్రోగ్రాం కోర్సులో 13 ఖాళీలు ఉన్నాయన్నారు. 10వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఈ కోర్సు ఒక ఏడాది పాటు చదవాల్సి ఉంటుందన్నారు. 

Updated Date - 2020-12-06T04:50:47+05:30 IST