నుర్మతి సీఆర్‌పీఎఫ్‌ అవుట్‌ పోస్టును సందర్శించిన ఐటీడీఏ పీవో

ABN , First Publish Date - 2021-06-23T05:30:00+05:30 IST

మండలంలోని నుర్మతిలో సీఆర్‌పీఎఫ్‌ అవుట్‌ పోస్టును ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ బుధవారం సందర్శించారు.

నుర్మతి సీఆర్‌పీఎఫ్‌ అవుట్‌ పోస్టును సందర్శించిన ఐటీడీఏ పీవో
అవుట్‌ పోస్టు వద్ద సీఆర్‌పీఎఫ్‌ అధికారులతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ

సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఆరా



జి.మాడుగుల, జూన్‌ 23: మండలంలోని నుర్మతిలో సీఆర్‌పీఎఫ్‌ అవుట్‌ పోస్టును ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక సాయంతో రూ.60 లక్షలతో నిర్మించిన రోడ్లను ఆయన పరిశీలించారు. సీఆర్‌పీఎఫ్‌ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉదయకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అవుట్‌ పోస్టుకు ఇంకేమైనా సదుపాయాలు కావాలంటే ప్రతిపాదనలు పంపాలని పీవో సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ కేవీఎస్‌ఎన్‌.కుమార్‌, డీఈఈ అనుదీప్‌, ఏఈఈ జబ్బర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-23T05:30:00+05:30 IST