Abn logo
Dec 3 2020 @ 00:52AM

ఐటీడీఏ పీవోకు అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం అభినందనలు


లాక్‌డౌన్‌ సమయంలో అందించిన సేవలకు గుర్తింపు


పాడేరు, డిసెంబరు 2: లాక్‌డౌన్‌ సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తులకు  విశాఖ జిల్లాలో సేవలు అందించినందుకు ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ను అభినందిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ లేఖ రాశారు. జిల్లా కొవిడ్‌ నోడల్‌ అధికారిగా ఉన్న ఆయన (అప్పట్లో సబ్‌ కలెక్టర్‌) ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఆయా ప్రాంతాలకు పంపడానికి ఏర్పాటు చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు, కార్మికులకు ఆయన సేవలు అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి... ఐటీడీఏ పీవోను అభినందించారు.  Advertisement
Advertisement
Advertisement