బాల్కనీ నుంచి పడి ఇటలీ రాయబారి మృతి

ABN , First Publish Date - 2022-02-21T20:10:24+05:30 IST

ఇటలీ రాయబారిగా ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న ఫ్రాన్సిస్కా టార్డియోలీ బాల్కనీ నుంచి పడి చనిపోయారు. ఈ దుర్ఘటన ఆమె సొంత పట్టణం ఫోలిగ్నోలోనే జరిగింది...

బాల్కనీ నుంచి పడి ఇటలీ రాయబారి మృతి

ఆస్ట్రేలియాలో ఇటలీ రాయబారిగా పనిచేస్తున్న ఫ్రాన్సిస్కా టార్డియోలీ తన ఇంటి బాల్కనీ నుంచి పడి చనిపోయారు. ఈ దుర్ఘటన ఆమె సొంత పట్టణం ఫోలిగ్నోలోనే జరిగింది. ఇటాలియన్ మీడియా నివేదికల ప్రకారం.. రాయబారి ఫ్రాన్సిస్కా ఆదివారం ఆమె ఇంటి బయట చనిపోయి పడున్నారు. దానికి కారణం ఆమె ఆ భవనం మూడో అంతస్తు నుంచి పడడమేనని తెలుస్తోంది. అయితే ఆమె మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. కాగా, ప్రమాదానికి సంబంధించిన కారణాలపై లోకల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ‘రాయబారి ఫ్రాన్సిస్కా టార్డియోలీ నాకు మంచి స్నేహితురాలే కాకుండా తెలివైన సహోద్యోగి. మంచి దౌత్యవేత్త కూడా. అలాంటి వ్యక్తి మరణం ఎంతో బాధాకరం’ అని ఇటలీలోని ఆస్ట్రేలియా రాయబారి మార్గరెట్ ట్వోమీ ట్విట్టర్‌లో తన బాధను వ్యక్తం చేశారు.

Updated Date - 2022-02-21T20:10:24+05:30 IST