న్యూఢిల్లీ: భారతీయులకు ఇటలీ గుడ్‌న్యూస్ చెప్పింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని ఇటలీలోని ఇండియన్ ఎంబసీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. భారత ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మండవియా.. తాజాగా ఇటలీ హెల్త్ మినిస్టర్‌తో సమావేశమైనట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కొవిషీల్డ్ అంశం చర్చకు వచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇటలీ ప్రభుత్వం కొవిషీల్డ్‌ను గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దీంతో కొవిషీల్డ్ టీకా పొందిన భారతీయులు.. ఇటలీలో గ్రీన్ పాస్‌లు పొందొచ్చని పేర్కొంది. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఇటలీ ప్రభుత్వం వైరస్‌ను కట్టడి చేయడానికి కఠిన చర్యలను తీసుకుంటోంది. వ్యాక్సిన్ వేసుకున్న ప్రజలకు మాత్రమే గ్రీన్ పాస్‌లను అందిస్తూ.. రెస్టారెంట్లు, బార్లు, కేఫ్‌లు తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే.